రాఖీ సంద‌ర్భంగా ఈ అన్న‌య్య ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే వావ్ అనాల్సిందే..

-

ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా దాదాపుగా అందరు మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టే ఉంటారు. ఈ సందర్భంగా ఐదొందలో వెయ్యి రూపాయాలో లేదా ఓ చీరను బహుమానంగా ఇచ్చి ఉంటారు బ్రదర్స్. అయితే, అందరు ఒకేలా బహుమానాలు ఇచ్చి ఉండకపోవచ్చు. కాగా, ఓ వ్యక్తి రాఖీ సందర్భంగా తన సోదరికి వినూత్నమైన బహుమతి ఇచ్చాడు. అదేంటో తెలిస్తే మీరు ఆనందపడిపోతారు. సదరు వ్యక్తికి చెల్లెలు, ఆమె కుటుంబీకుల పట్ల ఉన్న కేరింగ్ నేచర్ అర్థమవుతుంది.

రాఖీ పూర్ణిమ | Rakhi Purnima
రాఖీ పూర్ణిమ | Rakhi Purnima

వివరాల్లోకెళితే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో ఉంటున్న మడుపు రాం ప్రకాశ్ అనే వ్యక్తికి నలుగురు అక్కా చెల్లెళ్లున్నారు. వీరికి ముద్దుల సోదరుడిగా రాం ప్రకాశ్ ఉన్నారు. కాగా, రాఖీ సందర్భంగా రక్షా బంధన్ కట్టిన ఈ నలుగురు సోదరిమణులకు బ్రదర్ రాంప ప్రకాశ్ లక్ష రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, ఆక్సిజన్ ప్లాంట్‌ను బహూకరించాడు. గతేడాది కూడా ఇలానే సోదరిమణులకు మాస్కులు, శానిటైజర్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు రాం ప్రకాశ్.

అయితే, ఆయన ఇచ్చిన ఈ గిఫ్టులను గురించి తెలుసుకున్న చాలా మంది ఆయన్ను మెచ్చుకుంటున్నారు. ముందుచూపుతో ఆలోచించాడని ప్రశంసిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ట్రీట్‌మెంట్, ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగితే డబ్బులు చెల్లించే పరిస్థితులు అస్సలు ఉండవు. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలనే ఆలోచన రావడం చాలా బాగుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్ రిజిస్టర్ చేయడం కూడా మంచి ఆలోచనే. అప్పట్లో ఆక్సిజన్ కోసం సామాన్య జనాలు పడ్డ ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే నటుడు సోనుసూద్ రావాల్సిందే అనేంతలా సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. చాలా మంది అవిలేక ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news