తెలంగాణరాజకీయాల్లోకి కాస్త లేటుగానే ఎంట్రీ ఇచ్చినా కూడా తనదైన వ్యూహాలతో చెలరేగిపోవాలని అనుకుంటున్న షర్మిలకు మాత్రం ఆదిలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. అసలు ఆంధ్రాలో పెద్ద పెద్ద లీడర్లతో సలాం కొట్టించుకున్న షర్మలకు ఇక్కడ కనీసం ఒక్క లీడర్ కూడా పట్టించుకోవట్లేదు. ఆమె పార్టీలోకి రావడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక సొంత పార్టీలో అప్పుడే కుమ్ములాటలు జరుగుతున్నాయి. దీంతో ఆమెకు చికర్కులు పెరుగుతున్నాయి.
ఇప్పటికే పార్టీలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇదే పెద్ద సమస్య అనుకుంటే ఆమెకు మరిన్ని పెద్ద సమస్యలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇక ఆమె పాలిటిక్స్‌లో మొదటి నుంచి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రధానంగా ఆమె ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్తున్నారు.
అయితే ఇలా ఆమె ఇప్పటికే చాలామంది ఇండ్లకు వెల్లి వారిని ఓదార్చారు. అలాగే వారి ఇండ్ల ముందు దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఆమెకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. కొందరు తమ ఇండ్లకు రావొద్దంటూ వేడుకుంటున్నారు. ఇంకొదరు అయితే ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. ఇక ఇప్పుడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆత్మ హత్య చేసుకున్న నరేష్ తండ్రి కూడా తమ ఇంటికి షర్మిలను రావొద్దంటూ కోరుతున్నారు. దీంతో షర్మిలకు మరో పెద్ద షాక్ తగిలింది.