Covid-22 : డెల్టా కంటే ప్రమాదకరమైన కొత్త వేరియంట్…!

-

కరోనా మహమ్మారి కారణంగా చాలా సమస్యలు వచ్చాయి. మొదట వేవ్ లో మరియు రెండవ వేవ్ లో కూడా ఎన్నో సమస్యలు రావడం జరిగింది. అయితే ఈ మూడవ కూడా ఉంటుందని.. దీనికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. 2022 లో కొత్త వేరియంట్ వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇమ్మ్యూనోలోజిస్ట్, ప్రొఫెసర్ డాక్టర్ సాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం ప్రజలంతా కూడా కొత్త వేరియంట్ ని ఎదుర్కోవాలని.. దీన్ని యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. డాక్టర్ సాయి రెడ్డి జ్యుయిస్ బేస్డ్ సైంటిస్ట్. ఈ ప్రాణాంతకమైన వైరస్ మీద ఆయన రీసెర్చ్ చేశారు. అయితే ఇలాంటి ప్రాణాంతకమైన వైరస్లని ముందుగానే కనుక్కోవాలని.. దానికి తగ్గట్టుగా మనం అనుసరించాలని.. ముఖ్యంగా వ్యాక్సిన్ అందరికీ సరిపడేలా త్వరగా తయారు చెయ్యాలి అని చెప్పారు.

అయితే ఈ కొత్త వేరియంట్ వల్ల చాలా ప్రమాదం ఉందని మనం అందరూ సిద్ధంగా ఉండాలని అంటున్నారు. క్రిస్ స్మిత్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లెక్చరర్ ఇంకా ఈ వైరస్ అయిపోలేదు మనం ఒప్పుకుని తీరాలి అన్నారు. ఒకసారి అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే కొన్ని కేసులు మొదటి రావడం ఆ తర్వాత ఎక్కువమంది వైరస్ బారిన పడడం ఇలాంటివి మనం చూసామని.. కనుక ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news