మహిళా ఫుట్ బాలర్స్ చెస్ట్ పైన ఘోరమైన కామెంట్స్ చేసిన తంజానియా ప్రెసిడెంట్..!

-

తంజానియా ప్రెసిడెంట్  Samia Suluhu Hassan నోరు అదుపులో ఉంచుకోకుండా విపరీతమైన కామెంట్స్ చేసారు. ఈమె చెప్పిన ఈ విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏం మాట్లాడుతోందో తెలియకుండా నోరు పారేసుకుంది ఈ ప్రెసిడెంట్. గత ఆదివారం నాడు పురుషుల ఫుట్ బాల్ టీమ్ గెలుపొందిన సందర్భంగా ఓ సెర్మనీ జరిగింది. అప్పుడు ఆమె చాలా దారుణంగా కామెంట్స్ చేసారు.

మహిళా ఫుట్ బాల్ ప్లేయర్స్ చెస్ట్ ఫ్లాట్ గా ఉంటుందని… పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు అస్సలు ఆకర్షణీయంగా కనపడరు అని ఆమె అన్నారు. ఒకవేళ బాడీ చూస్తే పురుషులు అనుకుంటారని… మహిళలాగ వాళ్ళు కనపడరు అని ఆ ప్రెసిడెంట్ అన్నారు. అయితే వాళ్ల మొహం చూసేటప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అని కూడా అన్నారు. అయితే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే బాగా ఆకర్షణీయంగా ఉన్న మహిళల్ని చేసుకోవాలి.

అయితే ఫుట్ బాల్ ఆడే మహిళల్లో అటువంటి లక్షణాలు ఉండవు అని ఆమె అన్నారు. అయితే వీళ్ళు ట్రాఫి తెచ్చినప్పుడు దేశం అంతా కూడా ఎంతో గర్వంగా ఫీలవుతారు కానీ వాళ్ల నిజజీవితం చూస్తే మరొకలా ఉంటుంది వాళ్ల భవిష్యత్తు కూడా అలసటతో.. ఓపిక లేకుండా ఉంటారు. అదే విధంగా ఇటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్తే మీ ఇంట్లో ఉండే తల్లి కూడా అబ్బాయా, అమ్మాయ అని అడుగుతారు అని అన్నారు. ఇలా ఈమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news