కరోనా ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ముందు నుండీ ఆరోగ్యనిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాక్సిన్ లను ఇస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా తెలంగాణలో 1.74కోట్ల మంది వ్యాక్సిన్ లు వేసుకున్నారని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మొత్తం 2.20 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్దేశించగా..దాదాపు 80 శాతం మందికి వ్యాక్సిన్ లు ఇవ్వడం పూర్తయ్యిందని ప్రకటించింది. ఇక ప్రపంచ దేశాలతో పోలీస్తే వ్యాక్సిన్ విషయంతో భారత్ వెనకబడి ఉంది. మన దేశంలో ఏదో ఒక వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 33.6 శాతం ఉన్నారు. 217 దేశాల డేటాతో పోల్చితే భారత్ 110వ స్థానంలో నిలిచింది. యూఏఈ అత్యధికంగా 84.9శాతం వ్యాక్సినేషన్ చేసి అగ్రస్థానంలో ఉంది.