పబ్‌ లోకి 10 ఏళ్ల చిన్నారి..వీడియో వైరల్‌

-

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ అదుపు లోకి రావడంతో.. హైదరాబాద్‌ లో ఈ మధ్యలోనే బార్లు మరియు పబ్స్‌ రీ ఓపెన్‌ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంతోషిస్తూ… రూల్స్‌ ప్రకారం.. పబ్స్‌ నడుపు కోవాల్సిన యాజమన్యాలు… నియమ నిబంధనాలను అస్సలు పాటించడం లేదు. తాజాగా హైదరాబాద్‌ గచ్చి బౌలి లోని లాల్‌ స్ట్రీట్‌ పబ్‌ నిబంధనలను తుంగ లో తొక్కింది.

నిబంధనలను పాటించ కుండా పదేళ్ల చిన్నారిని పబ్‌ లోకి అనుమతించింది. పబ్‌ లో చిన్నారి డ్యాన్స్‌ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియా లో వైరల్‌ అయింది. ఆ వీడియో కాస్త… పోలీసులు కంట పడింది. దీంతో లాల్‌ స్ట్రీట్‌ పబ్‌ యాజమాన్యానికి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన పై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మాదాపూర్‌ ఏసీపీ మరియు సీఐలను డీసీపీ ఆదేశించారు. ఇక కాసేపటి క్రితమే… లాల్‌ స్ట్రీట్‌ పబ్‌ దగ్గరికి గచ్చిబౌలి పోలీసులు వెళ్లారు. ఈ ఘటన పై విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news