అమెరికాలో వరదల బీభత్సం… ఎమర్జెన్సీ ప్రకటన !

-

అగ్రరాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే అమెరికాలోని న్యూయార్క్‌, న్యూజెర్సీ ల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. రికార్డు స్థాయి లో కురిసిన వర్షం కారణంగా భయంకరమైన వరదలు రావడంతో… ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్‌ సిటీ మేయర్‌ బిల్‌ డె బ్లాసియో, న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ ముర్ఫే ట్వీట్‌ చేశారు.

వరద ప్రమాదకర స్థాయిలో ఉందని… ఎవరూ ఇండ్లు దాటి బయటకు ప్రజలకు సూచనలు చేశారు. రోడ్లు, సబ్‌ వేల వద్ద పరిస్తితి బీభత్సం గా ఉందని.. వెహకల్స్ డ్రైవ్‌ చేసుకుని రోడ్ల పైకి వచ్చే సాహసం చేయొద్దని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాండర్స్‌ సహాయక చర్యల్లో ఉన్నారని… ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమ లేదని పేర్కొన్నారు. ఐదా హరికేన్‌ తో న్యూయార్క్‌ స్టేట్‌ మొత్తం అతలాకుతలమవుతోంది. న్యూయార్క్‌ సిటీ వీధులు నీటితో నిండిపోయాయి. ఒక గంట సేపట్లోనే సిటీలో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అటు రాకపోకలకు కూడా ఇబ్బందులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news