ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాటరీలో వరున్ని గెలుచుకున్న ప్రియురాలు

-

కర్ణాటక రాష్ట్రంలో ఓ వింత పెళ్లి జరిగింది. ఇద్దరు ఒకే అబ్బాయిని ప్రేమించడంతో.. లాటరీ వేసి… మరీ ఆ పెళ్లి చేశారు గ్రామ పెద్దలు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హాసన జిల్లా సకలేశపురం ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు అంతర్జాలం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరిని ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు. ఆ ఇద్దరు యువతులకూ కూడా ఆ అబ్బాయి అంటే చచ్చేంతా ఇష్టం.

అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ రెడీ గా ఉన్నారు. ఈ నేపథ్యం లో ఆ యువకుడు గందర గోళ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యం లోనే ఆ అబ్బాయి దక్కడని…. విషం తాగి సుసైడ్‌ కు పాల్పడింది. దీంతో ఆ గ్రామస్తులు ఓ లాటరీ గేమ్‌ నిర్వహించారు. అందులో ఎవరి పేరు వస్తే… ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయికి షరతులు పెట్టారు. ఈనేపథ్యం లో ఆ లాటరీ తీశారు. ఇక ఈ లిస్టు లో విషం తాగిన అమ్మాయి పేరు వచ్చింది. దీంతో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఆ అబ్బాయి. దీంతో ఆ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీకి సుఖాంతం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news