హైదరాబాద్ మహా నగరం లో ఈరోజు, రేపు, ఎల్లుండి రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయని… క్యూములో నింబస్ మేఘాలు దట్టంగా అలుము కున్నాయని స్పష్టం చేశారు. అలాగే బంగాళాఖాతం లో అల్ప పీడనం ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఇక ఈ అల్పపీడన ప్రభావం తో తెలంగాణ రాష్ట్రం లోని పలు చోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యం లోనే 16 జిల్లాలకు రెడ్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచనలు చేసిందన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ ప్రకటించమని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. కాగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.