బండి సంజయ్….తెలంగాణ బిజేపికి ఒక ఆశాకిరణం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు తెలంగాణ బిజేపిని నడిపించిన నాయకులు ఉన్నారు. కానీ బండి మాదిరిగా ఏ నాయకుడు కూడా పార్టీకి కొత్త ఊపు మాత్రం తీసుకురాలేదనే చెప్పొచ్చు. ఆఖరికి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా చేసిన కూడా పార్టీ బలోపేతం కాలేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి కాస్త సాఫ్ట్. ఆయన తన ప్రత్యర్ధులపై దూకుడుగా ఎన్నడూ విమర్శలు చేయలేదు.
కానీ బండి సంజయ్ మాత్రం దూకుడుగా విమర్శలు చేయడంలో ముందున్నారు. తాను అధ్యక్షుడు అయ్యాకే పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ వీక్ అవ్వడం కూడా బండిగా బాగా కలిసొచ్చింది. దాని వల్ల బిజేపిని టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక కాస్త పరిస్తితి మారింది. బిజేపిని డౌన్ చేసి కాంగ్రెస్ రేసులోకి వచ్చింది.
అయితే మళ్ళీ బిజేపిని పైకి తీసుకురావడానికి బండి గట్టిగానే కష్టపడుతున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు సక్సెస్ ఫార్ములా అయిన పాదయాత్రని ఎంచుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగా అధికార టిఆర్‌ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
ఇంతవరకు అంతా బాగానే ఉంది గానీ, ఇక్కడే బండి కాస్త రూట్ మార్చాలని, ఆయన టిఆర్‌ఎస్‌ని టార్గెట్ చేయడమే కాకుండా, బిజేపిని బలోపేతం చేసే అంశంపై కూడా దృష్టి పెట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని రుజువు చేయాలి. ఎక్కడక్కడ పార్టీని బలోపేతం చేయాలి. బలమైన నాయకులని ఇంచార్జ్‌లుగా నియమించాలి. అసలు ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు బిజేపి ఇంచార్జ్‌లు పూర్తిగా ఉన్నారో లేరో తెలియని పరిస్తితి. కాబట్టి బండి…టిఆర్‌ఎస్‌ని టార్గెట్ చేయడమే కాకుండా, బిజేపిని బలోపేతం చేసే అంశంపై దృష్టి పెట్టాలి. అప్పుడే పార్టీ పికప్ అవుతుంది..లేదంటే అంతే సంగతులు.