ఆదాయపు పన్ను కట్టే వాళ్లకు శుభవార్త.. 5 లక్షల వరకు పన్ను లేదు

-

income tax limit extended upto 5 lakhs

మీరు ఆదాయపు పన్ను కడుతున్నారా? అయితే మీకు శుభవార్త. ఆదాయపు పన్ను పరిమితిని 2.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2019-20 ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లు ఎవరూ రూపాయి ఇన్ కమ్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. సంవత్సరానికి 6.5 లక్షల ఆదాయం ఉన్నవాళ్లు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)లో ఏవైనా పెట్టుబడులు, ఈక్విటీల్లో పెట్టుబడులు లాంటివి చేస్తే.. వాళ్లు కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నారు. అంతకు మించి ఆదాయం ఉన్నవాళ్లు కూడా హోమ్ లోన్స్, ఇతర లోన్స్, నేషనల్ ఇన్సురెన్స్ స్కీమ్స్, హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్ స్కీమ్స్ ల్లో డబ్బులు కడితే.. వాళ్ల కూడా టాక్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు గోయల్ తెలిపారు. ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచడం వల్ల ప్రస్తుతం ట్యాక్స్ పే చేస్తున్న 3 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news