ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరే దానికి లేదు. ఇక మన దేశం లో బంగారానికి ఉన్న గురించి అయితే… ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఉన్న మహిళలు… బంగారం కొనడానికి చాలా ఇష్టపడతారు. ఏ చిన్న పండగ వచ్చిన ఎగబడిపోతారు. అయితే… మొన్నటి వరకు మన దేశం లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. పెరగడమే తప్పా.. తగ్గలేదు. ఈ నేపథ్యం లో తాజాగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి.
గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మరియు ఈరోజు ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 48,000 కు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 44,000 కు తగ్గింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. కేజీ వెండి ధర రూ. 800 తగ్గి… రూ. 68, 300 వద్దకు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గినట్టు తెలుస్తోంది.