గ్రామ సచివాలయ పరీక్ష తేదీ ఫిక్స్..!

గ్రామ సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28 నుండి 30 వరకు గ్రామ, సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. అంతే కాకుండా ఈనెల 13 నుండి 17 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.

మొత్తం 100 మార్కులకు గానూ 40 మార్కులు వస్తే ప్రొబేషనరీ కి అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. Psc.ap.gov.in/ అనే వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూజర్ ఐడీ తో అప్లై చేసుకోవాలని తెలిపింది. కాగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.