ఖైరతాబాద్ వెళ్ళేవారికి అలర్ట్ : ఈ రూల్స్ పాటించాల్సిందే

-

ఇవాళ ఖైరతాబాద్‌ మహా గణపతి కి అట్టహాసం గా పూజ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ చేయనున్నారు. ఇక ఈ తొలి పూజ లో తెలంగాణ గవర్నర్ తమిళ సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. ఈ సారి 40 అడుగుల ఎత్తు లో శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా దర్శనం ఇస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి.. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి కి ఇరు వైపులా క్రిష్ణ కాళి, కాల నాగేశ్వరిలు ఈ సారి దర్శనం ఇస్తున్నారు.

ఈ నేపథ్యం లో ఖైరతాబాద్‌ మహా గణపతి ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ తరుణం లో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ముఖ్యంగా ఖైరతాబాద్ మెయిన్ రోడ్డు లో… బారికేడ్లు ఏర్పాటు చేసి… కేవలం భక్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు పోలీసులు.

అలాగే భక్తులకు కీలక సూచనలు చేశారు పోలీసులు. భక్తులు సొంత వాహనాల్లో రాకూడదని… మెట్రో మరియు హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ లలో రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సిటీ బస్సులలో వస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. కార్లు మరియు బైక్లపై వచ్చేవారికి… హెచ్ఎండిఏ పార్కింగ్ స్థలంలో… పార్కింగ్ కు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. సొంత వాహనాల్లో రాకపోవడమే మంచిదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news