బ్రేకింగ్ : ఏపీ సీఎస్ గా సమీర్ శర్మ నియామకం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ గా… ఐఏఎస్ ఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ నియామకం అయ్యారు. 1985వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ గా జగన్ సర్కార్ నియామకం చేసింది. ఈనెల 30వ తేదీన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్.. ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో… జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆప్కో సి.ఎం.డి గా సమీర్ శర్మ పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా సమీర్ శర్మను నియామకం చేసింది జగన్ సర్కార్. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సమీర్ శర్మ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్… సమీర్ శర్మ కంటే రెండేళ్లు జూనియర్ కావడం విశేషం.