అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు..!

-

భారత దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవల్ని అందిస్తోంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఓ గుడ్ న్యూస్ ని తీసుకు రావడం జరిగింది. ఇది రైతులకి లాభదాయకంగా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పటి వరకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు (kisan credit card) రివ్యూ కోసం రైతులు బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక నుండి ఎస్బీఐ ఆ అవసరం లేకుండా చేసింది.farmers

 

SBI రైతులకు పలు రకాల సేవలను అందిస్తుంది. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం తో ఇంట్లో నుంచే ఆ పని పూర్తి చేసుకోవచ్చని స్టేట్ బ్యాంక్ తెలిపింది. కేసీసీ అకౌంట్‌ను ఇంటి నుంచే సమీక్షించుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. ట్విట్టర్ ద్వారా స్వయంగా ఎస్బీఐ ఈ విషయాన్ని తెలియజేసింది. ఎస్‌బీఐ లో అకౌంట్ కలిగిన రైతులు తమ కేసీసీ రివ్యూ కోసం బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండానే అప్లై చేసుకో వచ్చని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది.

అయితే బ్యాంక్ కి వెళ్లకుండా ఎలా అనేది చూస్తే.. దీని కోసం రైతులు యోనో యాప్ ని ఉపయోగించాల్సి ఉంది. ఎస్బీఐ తమ కస్టమర్ల కోసం యోనో యాప్ నుంచి పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. కస్టమర్స్ కి యోనో యాప్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎన్నో రకాల పనులను ఈజీగా ఈ యాప్ ద్వారా పూర్తి చేసుకోచ్చు. అయితే రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.

యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్ ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కేసీసీ స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకు సులభంగానే రుణాలు ఇవ్వాలని దీనిని తీసుకొచ్చారు. పీఎం కిసాన్ లో లబ్ధిదారులుగా ప్రతీ ఒక్కరు కేసీసీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news