బిగ్ బాస్: షణ్ముఖ్, సిరి బయటే వ్యూహాలు రచించారా? సరయు ఇచ్చిన షాక్..

బిగ్ బాస్ ఐదవ సీజన్లో మొదటి వారంలో కంటెస్టెంట్ సరయు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఏడు రోజుల బిగ్ బాస్ ప్రయాణంలో కంటెస్టెంట్ సరయు, ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐతే మిగతా హౌస్ మేట్స్ లో చాలామందితో పోలిస్తే సరయునే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో సరయు ముందుంటారనేది చాలామంది వాదన. కానీ, బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి పెద్దగా ప్లేస్ ఉండదని, వీక్ గా ఉండి, ఆడుతున్నట్టు నటించేవాళ్ళకే ఓట్లు పడతాయని గత సీజన్లో దేవి నిష్క్రమణతో నిరూపితమయిందని సోషల్ మీడియాఅలో చెప్పుకుంటున్నారు.

అదలా ఉంచితే, తాజాగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయిన సరయు, నాగార్జున వద్దకు వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. ఒక్కొక్కరి ప్రవర్తనను ఎండగడుతూ సూటిగా మాట్లాడింది. ముఖ్యంగా షణ్ముఖ్, సిరి.. ఇద్దరి గురించి మాట్లాడుతూ, వీళ్ళిద్దరూ బయటే వ్యూహాలు రచించారని, ఒకరొకరు సాయం చేసుకోము అనుకుంటూనే ఇద్దరూ సాయం చేసుకుంటున్నారని, అందుకే బాగా తెలివిగా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేసింది. ఇక లహరిపై చివ్వున ఎగిసింది.

నేను గొప్ప అని చెప్పుకోవడానికి అవతలి వారిని తొక్కాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని మాట్లాడింది. ఇంకా సన్నీ గురించి చెబుతూ, బయట సినిమాలో నటించిన విషయాన్ని పట్టుకుని, ఇక్కడ ప్రతీకారం చూపించాడని, నన్ను నామినేషన్స్ లో పెట్టిన కారణం కూడా చాలా చిన్నదని సరయు వివరించింది. మొత్తానికి మొదటి ఎలిమినేషన్లో బయటకు వెళ్ళిపోయిన సరయు, చాలా సూటిగా సుత్తిలేకుండా మాట్లాడిందనే చెప్పుకోవాలి.