Ganesh immersion: బై బై గణేషా.. శోభ‌యాత్ర‌కు సిద్ద‌మైన ఖైర‌తాబాద్ భారీ గ‌ణేశుడు

-

Ganesh immersion: తొమ్మిది రోజులు పాటు విశేష పూజలందుకున్న ఖైరతాబాద్‌ గణేశుడు(Khairatabad Ganesh) నిమజ్జనానికి త‌ర‌లివెళ్తున్నాడు. 40 అడుగుల్లో పంచముఖ రుద్ర మహా గణపతిగా కొలువుదీరిన ఈ గ‌ణేశుడు ఈ రోజు ఉదయం 9 గంటలకు గంగ ఒడికి బయలుదేరనున్నాడు. భారీ గణనాథుని నిమజ్జనానికి(Ganesh Nimajjanam) ఇటు ప్ర‌భుత్వం అటు నిర్వ‌హ‌కులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Ganesh immersion

దాదాపు రెండున్న‌ర కిలోమీట‌ర్ల సాగే భారీ గణేశుడి శోభాయాత్రకు పోలీసులు ప్ర‌త్యేక రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు. ఖైరతాబాద్ గ‌ణనాయ‌కుడి శోభ‌యాత్ర‌.. ద్వారకా హోటల్‌, టెలీఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, ఓల్డ్‌ సెక్రటేరియట్‌ గేట్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, లుంబినీ పార్క్‌ మీదుగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కు నిమజ్జనం పూర్తి కానున్న‌ది. హుస్సేన్‌సాగర్‌లోని క్రేన్‌ నెంబర్‌ 6 దగ్గర నిమ‌జ్జ‌నం జరుగును.ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 330 క్రేన్లను ఏర్పాటు చేశారు. న‌గ‌రంలో హుస్సేన్‌సాగర్‌తోపాటు మొత్తం 30 చెరువుల్లో నిమజ్జనాలు ఏర్పాటు చేశారు. కేవ‌లం హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. 162 గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ విధుల్లో ఉండనున్నాయి.

భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాటు.. శోభ‌యాత్ర‌కు విచ్చేసే భ‌క్తుల తాగునీటికి 30లక్షల వాటర్‌ ప్యాకెట్లను జలమండలి సిద్ధం చేసింది. అలాగే అత్య‌వ‌స‌ర పరిస్థితి కోసం దాదాపు 50 అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద గణేశ్‌ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ స‌ర్కార్.

భక్తుల భ‌ద్ర‌త కోసం .. క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాటు చేశామ‌ని సీపీ తెలిపారు. 27 వేల మంది పోలీసులు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. అలాగే.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల‌తో ప్ర‌త్యేక నిఘా పెట్టామని వెల్లడించారు.

అలాగే.. ఆర్టీసీ కూడా ప్ర‌త్యేక్ష ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను న‌డ‌ప‌నున్న‌ది. అలాగే.. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే.. మెట్రో కూడా అర్థరాత్రి వరకూ సర్వీసులను నడపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news