Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతడో మిస్సెల్. మైదానంలో పరుగుల సునామీని సృష్టించే రన్నింగ్ మెషిన్.. ఆయన క్రీజ్‌లో అడుగుపెట్టితే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. క్రీజ్‌లోనే గ్రౌండ్‌లోనూ హైపర్ యాక్టివ్. రాకెట్ లాగా దూసుకపోతాడు. గత గురువారం ఐసీసీ బోర్డు టీ 20 ర్యాకింగ్స్‌ను ప్రకటించిన కాసేపటికే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్‌గా వైదొలుతానని నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయం విరాట్ ఫ్యాన్స్‌ను ఒకింత షాక్‌కు గురి చేసింది.
అయితే.. ఆ షాక్ నుంచి తెరుకోక ముందే.. ఇప్పుడూ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 2021 తర్వాత రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్సీ కూడా వదులుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కెప్టెన్‌గా ఇదే నాకు చివరి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్ మ్యాచ్‌లు పూర్తికాగానే కెప్టెన్సీ పగ్గాలను వదులు కుంటాను. ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ ఆడినంత కాలం ప్లేయర్‌గా బెంగళూరు జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగుతాను. మరే జట్టు ప్రతినిథ్యం వహించను.ఇన్నాళ్లు నా మీద నమ్మకం ఉంచి, మద్దతు ఇచ్చిన ఆర్‌సీబీ అభిమానులకు, జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు’ ఈ మేరకు ఆర్‌సీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో కోహ్లి వీడియో సందేశం విడుదల చేశాడు.
విరాట్ కోహ్లీ .. 2008 నుంచి ఆర్‌సీబీ జట్టు తరఫున ఆడుతున్నాడు. 2013లో ఆ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టారు. అంతబాగానే ఉన్నా.. ఇంత హఠాత్తుగా ఆర్‌సీబీ కెప్టెన్సీని ఎందుకు వదులుకుంటున్నాడో కారణం తెలియాల్సి ఉంది. కోహ్లీ నిర్ణయం మాత్రం .. క్రికెట్ అభిమానులకు షాకిచ్చిందేననీ చెప్పాలి.
కోహ్లీకి ఐపీఎల్ కూడా ఘనత చరిత్ర ఉంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ 199 మ్యాచులు ఆడిన ఆయన 6076 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 40 హప్ సెంచరీలు. 2009, 2011, 2016లో ఆర్‌సీబీ ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌గానే మిగిలింది.