పిల్లల్లో కరోనా తీవ్రత తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటివరకు కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో 1.8 శాతం ఉన్నారని తెలిపింది. 6 నుండి 14 ఏళ్ల వయస్సు వారు 6.2 శాతం మంది కరోనా భారిన పడ్డారని పేర్కొంది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వయసు వారు 14.3 శాతం మంది ఉన్నట్టు వెల్లడించింది. అంతే కాకుండా చిన్నారుల్లో మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల్లో 99.8 శాతం మరణాలు 15 ఏళ్ల పై బడిన వారిలోనే నమోదు అయ్యాయని తెలిపింది. ప్రపంచం పై పంజా విసిరిన కరోనా పిల్లలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కరోనా కేసులు మొదలవ్వగానే స్కూల్స్ ను ప్రభుత్వాలు మూసివేశాయి. తల్లి తండ్రులు కూడా పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. అయితే థర్డ్ వేవ్ ముప్పు పిల్లలపైనే ఉంటుందని నిపుణులు భావించారు. కానీ ఇప్పటివరకు అయితే మహమ్మారి ప్రభావం కనిపించలేదు.