బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ డర్టీ పిక్చర్ భామ విద్యా బాలన్ కెరియర్ లో ఎవరు చేయని ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా తన హవా కొనసాగిస్తున్న విద్యా బాలన్ ఈమధ్యనే తెలుగులో ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో అలరించింది. కథానాయకుడు సినిమాలో ఆమెకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర లభించిందని చెప్పొచ్చు.
ఇక ఈమధ్యనే 40 వసంతంలోకి అడుగు పెట్టిన విద్యా బాలన్ సెక్స్ పాఠాలు చెబుతుంది. 40 తర్వాత ఆడవాళ్లకు సెక్స్ పై ఆలోచన ఉండదు కదా అన్న ప్రశ్నకు.. అసలు మజా 40 తర్వాతే ఉంటుంది. ఈ టైంలోనే సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటి ఒత్తిడిలు ఉండవని సెక్స్ పాఠాలు చెబుతుంది విద్యా బాలన్. వయసు మీద పడుతున్న కొద్ది ఆడవాళ్లు సంతోషంగా, చురుకుగా కనిపిస్తారని అంటుంది. మరి విద్యా ఏ ఎనాలసిస్ మీద అలా చెప్పిందో కాని విద్య బాలన్ చేసిన సెక్స్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారాయి.