భువనగిరి కే.కే నర్సింగ్ హోమ్ లో దారుణం చోటు చేసుకుంది. సీజరింగ్ చేసే సమయంలో మహిళ కడుపులో కాటన్ వైద్యులు కాటన్ ను మర్చిపోయారు. దాంతో ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో మహిళ బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే అప్పటికే మహిళ కడుపులో పాయిజన్ కాటన్ పాయిజన్ గా మారినట్టు వైద్యులు గుర్తించారు.
కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మమత మృతి చెందింది. మమత కడుపులో నుండి కాటన్ ను వైద్యులు భయటకు తీశారు. ఘటనకు భాద్యులైన కేకే నర్సింగ్ హోమ్ ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.