విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో వాణిజ్య ఉత్సవం- 2021 ను కాసేపటి క్రితమే ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుత… 8 కొత్త ఫిషింగ్ హార్బర్ల్ నిర్మాణం చేపడుతున్నామని… ఏపీ లోని మత్స్యకారులు గుజరాత్ లాంటి రాష్ట్ర లకు తరలి వెళ్లకుండా ఈ ఫిషింగ్ హార్బర్ లు ఉపకరిస్తాయని తెలిపారు.
3 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో వీటి నిర్మాణం దశల వారీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని… తద్వారా 76, 230 మందికి నేరుగా ఉపాధి కలుగుతుందని వెల్లడించారు. ఏపీకి వచ్చే ప్రతి ఎగుమతిదారుకు తగిన అవకాశాలు కల్పిస్తామని… ఏపీ కి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నానని వెల్లడించారు. భారత్ దేశ ఎగుమతులు 330 బిలియన్ డాలర్ల నుంచి 229 బిలియన్ డాలర్లకు తగ్గాయని.. ఏపీ క్రమంగా ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తోందన్నారు. 2021లో 19.4 శాతం మేర పెరిగాయని… ఆక్వా ఉత్పత్తులు, బోట్లు షిప్ నిర్మాణం , ఫార్మా తదితర రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు సాధిస్తోందని వెల్లడించారు. 68 మెగా పరిశ్రమ లు ఏపీలో ఉత్పత్తిలు చేస్తున్నాయని… గత రెండేళ్లలో 30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.