జగన్ సర్కార్ కు మరో ఊహించని షాక్ తగిలింది. టీటీడీ పాలక మండలి నియామకం పై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు. ఇవాళ టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకం పై హై కోర్టు లో విచారణ చేపట్టింది.
ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ… ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ జీవో ను హై కోర్టు కొట్టేసింది. ప్రత్యేక ఆహ్వానితులు గా 50 మందిని టీటీడీ నియమించడం పై మధ్యంతరు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హై కోర్టు. నాలుగు వారాల పాటు తీర్పు ను రిజర్వ్ చేసింది ఏపీ హై కోర్టు. కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఏర్పాటు పై కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఉమామహేశ్వర నాయుడు… హైకోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఎండోమెంట్ ఆక్ట్ 1987 కు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి బోర్డు నియామకం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు టిడిపి నేత ఉమా మహేశ్వర నాయుడు.