కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. కేంద్రం నిర్ణయం

-

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కరోనా కారణం గా మరణించిన వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ . 50,000 పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.

modi

అన్ని రాష్ట్రాలు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుండి ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలియ జేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ద్వారా ఈ సిఫార్సులు చేసింది. కాగా మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇవాళ భారీగా భారీగా తగ్గు ముఖం పట్టాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 26,964 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇక దేశంలో తాజాగా 383 మంది కరోనా తో మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news