చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు సంచలన తీర్పు!

-

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై ఇవాళ హైకోర్టు విచారణ చేసింది. చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీ ని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరారు చెన్నమనేని తరఫు న్యాయవాది వై. రామారావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖం వ్యక్తం చేశారు.

అనేక రకమైన అఫిడవిట్ లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదనకు చేయడానికి సిద్ధంగా ఉండాలని హైకోర్ట్ పేర్కొంది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ రావు. ఇప్పటికే కేసు చాలా జాప్యం జరుగుతోందని, వెంటనే కోర్ట్ వాదనలు పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వాలని కోరారు సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ రావు. ఇక అక్టోబర్ 21న భౌతిక వాదనలు జరుపుతామని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. అంతే కాదు తదుపరి విచారణను అక్టోబర్ 21 వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news