Ipl 2021 : రాణించిన నైట్ రైడర్స్… చెన్నై టార్గెట్ 172

-

ఇవాళ అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 38 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లు… అద్భుతంగా రాణించారు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఏకంగా 171 పరుగులు చేసింది.

రాహుల్ త్రిపాఠి 45 పరుగులు, నితీష్ రానా 37 పరుగులు నాటౌట్, ఆండ్రూ రస్సెల్ 20 పరుగులు మరియు దినేష్ కార్తీక్ 26 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు ను అందించారు. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 8 పరుగులకే అవుట్ కాగా తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. అయినప్పటికీ మిడిలార్డర్ రాణించడంతో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని కలిగింది కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయాల్లో కి వస్తే… శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు, హజల్ వుడ్ రెండు వికెట్లు మరియు రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించారు. ఇక మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే 20 ఓవర్లలో 172 పరుగులు చేయాల్సి ఉంది చెన్నై జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news