సెప్టెంబర్ 27 వ తేదీ.. అంటే రేపు జరిగే భారత్ బంద్ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. రేపు జరిగే భారత్ బంద్ కు తెలంగాణ ఆర్టీసీ దూరంగా ఉండనుందని పేర్కొంది ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బస్సు సర్వీసులు యధా విధంగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
కేవలం తెలంగాణ పరిధిలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సర్వీసులను కూడా నడుస్తాయని ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం. ప్రజలు ప్రతి రోజులాగే… తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ కార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి … బస్సు సర్వీసులు నడవబోవని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతు సంఘాలు మరియు వామ పక్షాలు రేపటి రోజున భారత్ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారత్ బంధు కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని వామపక్షాలు మద్దతు పలకగా…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.