గుప్పెడంతమనసు ఎపిసోడ్ 255: తన ఉత్సాహం, విజయం వెనుక ఉంది తన అమ్మ అని వసూ-జగతి చెప్పిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీని చూసుకోకుండా వసూ జగతి అనుకుని మాట్లాడేస్తుంది. రిషీ..ఓహో నేను ఇంటికొస్తే పార్టీ కూడా తీసుకుంటావా, ఇంకా నయం నన్ను తిట్టలేదు అంటాడు. సార్ మిమ్మల్ని ఎందుకు తిడతాను..మీరు జెంటిల్ మెన్ అనబోతుంది. వద్దు నువ్వు పొగుడుతావో, తిడతావో తెలియటం లేదు అని చుట్టు అంతా చూస్తాడు. వసూ ఏంటీ సార్ ఇలా వచ్చారు అని అంటుంది. అక్కడ ఊపిరాడటం లేదు అందుకే వచ్చాను అంటాడు రిషీ..వసూ సార్ ఏసీ ఆన్ చేయనా అంటుంది. ఏసీ ఆన్ చేసి దుప్పుటికప్పి నిద్రపుచ్చుతావా అని రిషీ అడుగుతాడు. అక్కడ అన్ ఈజీగా ఉండి వచ్చాను, నన్ను నన్నులానే చూడూ స్పెషల్ గా చూడకు అని…రిషీ అలా రూం అంతా చూస్తూ బెడ్ వైపూ తీక్షణంగా చూస్తాడు. గతంలో వసూకి జ్వరం వచ్చినప్పుడు వచ్చిన సీన్ గుర్తుచేసుకుంటాడు. వసూ ఏంటీ సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏ అలా చూడకూడదని ఏమైనా రూల్ ఉందా అంటాడు. రిషీతో ఏమన్నా చిక్కే. వసూ పెండ్రైవ్ ఇచ్చి మిషన్ ఎడ్యుకేషన్ డేటా ఇది మీ కాపీ అని ఇస్తుంది. రిషీ కబోడ్ లో డీఐజీ ఇంటికి వసూ కట్టుకొచ్చిన శారీ చూసి..ఆరోజు అడిగావ్ కదా ఈరోజు ఆన్సర్ ఇస్తాను అంటాడు. వసూ ఏం అడిగాను సార్ అంటే..నువ్వే అడుగుతావ్, నువ్వే మర్చిపోతావా అని చీరలో బాగున్నానా అని అడిగావు కదా బాగుంది అంటాడు రిషీ.. వసూ సిగ్గుతో..చీర బాగుందా నేను బాగున్నానా అంటుంది. బాగుంది అని చెప్పాను కదా అంతే, చీర కట్టుకుని బయట తిరగకు అంటాడు. వసూ ఏంటో బాగుంది అంటాడు, అందరి ముందు తిరగొద్దు అంటారు అని మనసులో అనుకుంటుంది. సార్ వర్క్ అయిపోయింది. పెండ్రైవ్ సార్ కి ఇస్తే సరిపోతుంది అంటుంది. నువ్వే ఇవ్వు అని రిషీ వెళ్తాడు.. జేబులో పెట్టుకున్న పెండ్రైవ్ అనుకోకుండా రూంలోనే కిందపడిపోతుంది. ఈ విషయం ఇద్దరు చూసుకోరు.

వసూ కబోడ్ లో ఉన్న ఆ చీరను పట్టుకుని రిషీ ఆరోజు కిందపడుతుంటే పట్టుకున్న సీన్ గుర్తుచేసుకుంటుంది. మనోడు వెళ్లినట్లే వెళ్లి వెనకకు చూసి వసూకి మెసేజ్ చేస్తాడు. వసూ చూస్తుంది.. మనం రెస్టారెంట్ లో కలుద్దాం అని మెసేజ్ చూసి అలాగే సార్ అని రిప్లైయ్ ఇస్తుంది. ఇద్దరు బయటకు వచ్చి హాల్ లో కుర్చుంటారు. బయలుదేరదామా అని దామోదర్ అంటాడు. జగతిని పొగిడి ఇలానే మంచి పనులు చేయండి అంటాడు దామోదర్. రిషీ మంచి ఆలోచనకు దక్కిన గౌరవం మేడమ్ ఇది అంటాడు. కొడుకు మొచ్చుకునే సిరకి జగతి ఆనందిస్తుంది. ఫణీంద్ర ..మేడమ్ మీరు పంపిన లీవ్ లెటర్ ని నేను ఒప్పుకోవటం లేదు, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాతే లీవ్ తీసుకోండి మన కాలేజ్ కోసం అని లీవ్ లెటర్ అక్కడే పెట్టేసి వెళ్లిపోతారు. వసూ ఇది అభినందనసభలా అనిపించింది మేడమ్ అంటుంది. అందిరి అభినందనల కన్నా రిషీ నన్ను మెచ్చుకున్నాడు..చాలా సంతోషంగా ఉంది అంటుంది.

సాయంత్రం రెస్టారెంట్ లో వసూ రిషీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డోర్ వైపు చూస్తూ..రిషీ సార్ వస్తా అన్నారు ఇంకా రాలేదేంటో అనుకుంటూ ఉంటుంది..ఇంతలో శిరీష్ ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావ్ అంటే రెస్టారెంట్ లో అంటుంది. శిరీష్ కూడా రెస్టారెంట్ కి వస్తా అంటాడు. వసూ వద్దు అంటుంది. నాకు తెలుసు నువ్వు ఎందుకు వద్దంటున్నావో కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కుదరదు అంటావ్ అని వస్తా అదిఇదీ అంటాడు. ఇంతలో రిషీ వస్తాడు. వసూ శిరీష్ రిషీ సార్ వస్తున్నారు నేను మళ్లీ మాట్లాడతాను బాయ్ అంటుంది. శిరీష్ ఏంటి అంత భయం..అది కాలేజ్ కాదు అని చెప్తూనేఉంటాడు వసూ ఫోన్ కట్ చేస్తుంది.

రిషీ వచ్చి కుర్చునే లోపులోనే కాఫీ తెమ్మంటారా అని అడుగుతుంది వసూ. కుర్చోవచ్చా నిలబడే తాగాలా అని అడుగుతాడు. వసూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి టెన్షన్ గా కనిపిస్తున్నావ్ అంటే ఏం లేదు సార్ అని కాఫీ తెస్తుంది. కాఫీ తాగాక బాగుందా అని అడుగు అంటాడు. కాఫీ తాగేసి రిషీయే బాగుంది అంటాడు. వసూ నేను అడగలేదు కదా సార్ అంటుంది. ఊరికే చెప్పాలనిపించింది చెప్పాను అని..మనం బయటకువెళ్లాలి వెళ్లి మీ మేనేజర్ ని పర్మిషన్ అడుగు అంటాడు. వసూ ఏం మాట్లాడదు. అడుగు ఎక్కడిసార్, ఎటు వెళ్తున్నాము అని అడుగుతావ్ కదా అంటాడు. అడగను సార్..చిన్న క్లూ కానీ హింట్ కానీ ఇవ్వండి అంటుంది వసూ. మనం ఏమన్నా గళ్లు నింపే ఫజిల్ ఆడుతున్నామా క్లూ ఇవ్వటానికి, కారు దగ్గర ఉంటాను త్వరగా రా అని వెళ్తాడు. వసూ మనసులో ఎక్కడికో చెప్పొచ్చుకదా అనుకుంటుంది.

ఇంకో సీన్ లో జగతి ఆనందంగా రిషీ నా ఇంటికి వచ్చి నా చేత్తో ఇచ్చిన జ్యూస్ తాగాడు అనుకుంటుంది. రిషీ తాగేసి మిగిలిన జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది. అమ్మ ఇచ్చిన జ్యూస్ తాగావా నాన్న, సెక్రటరీ గారికి వెయ్యి థ్యాంక్స్ లు చెప్పుకోవాలి, ఆయన వచ్చినందుకే కదా నువ్వు వచ్చావ్… ఈ గ్లాస్ నాకు ప్రత్యేకమైంది..అపురూపంగా దాచుకుంటాను అనుకుని గ్లాస్ కడిగి కబోడ్ లో పెడుతుంది. కిందపడిన పెండ్రైవ్ చూసి..ఇది రిషీ పెండ్రైవ్ లా ఉందే..దీన్ని రిషీకి ఇవ్వాలా, తన జ్ఞాపకంలా దాచుకోవాలా అనుకుని ఇచ్చేద్దాం అనుకుంటుంది.

మరోవైపు రిషీ వసూ ఒక ప్లేస్ కి వస్తారు. మాట్లాడాలి దిగు అంటాడు రిషీ. పెద్దమ్మను కలిసావ్ అంటగా అని రిషీ అడుగుతాడు. వసూ అవును సార్ అంటుంది. ఏమన్నారు అని..మళ్లీ తనే ఇంకేం అడుగుతారులే కాలేజ్ గురించి, నా గురించి అడుగుతారు. పెద్దమ్మకు నేనంటే ప్రాణం, కాలు కిందపెట్టకుండా చూసుకుంటుంది. నేను తినకుంటే తన పస్తులు ఉండేది అంటూ పెద్దమమ్మ మీద ప్రేమను చెప్పుకొస్తాడు. వసూ మనసులో ఆవిడ నిజస్వరూపం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అనుకుంటుంది. పెద్దమ్మ మనసు చాలా గొప్పది, ఆవిడ వెటకారంగా ఏమన్నా అంటే పట్టించుకోకు, ఏమన్నా అన్నారా అంటాడు. ఆవిడేమంటారు సార్ నన్ను అని వసూ అంటుంది. పెద్దమ్మను గౌరవించేవాళ్లంటే నేను గౌరవిస్తాను..పెద్దమ్మను ఇష్టపడని వాళ్లంటే నాకు ఇష్టం ఉండదు అంటూ పెద్దమ్మ గురించి గొప్పగా చెబుతాడు.

వసూ ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం సార్, మిషన్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడుకుందాం అంటుంది. సరే నీ ఇష్టం అంటాడు రిషీ. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వసూ-రిషీ మాట్లాడుకుంటూ ఉండగా జగతి వస్తుంది. రిషీ నా ఉత్సాహానికి, నా ఎదుగుదలకు, నా విజయాలకు ఒక స్త్రీ కారణం అంటాడు. ఆవిడ ఎ‌వరో మీరు తెలుసకోవాలి అంటాడు. జగతి మనసులో నీ విజయం వెనుక ఉంది వసుధార అంటావా రిషీ అనుకుంటుంది. కానీ రీషీ మాత్రం తన విజయానికి కారణం మా అమ్మ అంటాడు. ఆ మాటకు వసూ జగతి షాక్ అవుతారు. అమ్మంటే దేవయాని అమ్మ అంటాడేమే రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news