తెలంగాణ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రభుత్వం చెప్పింది. కాంట్రాక్టు అధ్యాపకులను మరో ఏడాది వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4366 మంది ఒప్పంద, పొరుగు సేవల, టైం స్కేల్ విధానం లో పనిచేస్తున్న అధ్యాపకులు ఉన్నారు. అయితే అలాంటి అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం 2020- 22 లో కూడా పని చేసేందుకు సర్కారు అనుమతులు జారీ చేసింది.
ఇక ఒప్పందం ముగుస్తుండటంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఆందోళన చెందారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆందోళన చెందారు. కానీ సర్కార్ వారి సేవలను కొససాగించాలని నిర్ణయం తీసుకుని గుడ్ న్యూస్ చెప్పింది. దాంతో ఈ నిర్ణయంపై కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.