Gold-Silver Price: బ్యాడ్ న్యూస్‌.. పసిడి, వెండి ధరల్లో పెరుగుద‌ల‌.. ఎంతంటే?

-

Gold-Silver Price: బంగారం ధ‌ర‌ల్లో నిత్యం మార్పులు జ‌రుగుతునే ఉంటాయి. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. అయినా మ‌న దేశంలో కొనుగోళ్లు మాత్రం ఆగ‌వు. ఏ చిన్న సందర్భం దొరికినా బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తిని చూపుతారు. వివిధ రూపాయల్లో బంగారంపై పెట్టుబడి పెట్టాల‌ని భావిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

గ‌త రెండు రోజులుగా నేలచూపులు చూసిన ప‌సిడి ధ‌ర‌లు నేడు ఎగబాకాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా గురువారం (సెప్టెంబర్ 30) బంగారం, వెండి ధరల్లో పెరుగుద‌ల క‌నిపించింది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 లుగా ప‌లుకుతుంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,460 లుగా ప‌లుకుతుంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. .
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. .
  • విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. ప్రస్తుతం పసిడి ధరలు స్వ‌ల్ప మార్పులు క‌నిపించినా.. దీపావళి పండగ తర్వాత రూ.60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇక వెండి ధరల్లో కూడా స్వ‌ల్పంగా మార్పు చోటుచేసుకుంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,800గా ఉంది. హైదరాబాదులలో రూ. 64.800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,450లు గా ప‌లుకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news