పెన్షన్ తీసుకునే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

-

పెన్షన్ లబ్ది దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పై రాష్ట్రం లో ఎక్కడ నుండి అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురాలని నిర్ణయించింది. ప్రస్తుతం రేషన్ ఇస్తున్న విధంగానే పెన్షన్ ను కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆదేశాలు జారీచేసింది. ఉపాధి ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి పెన్షన్ ను అక్కడే ఇవ్వనున్నారు. ఆరు నెలల పాటు వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టు నిర్ధారించి ఆ తరవాత పెన్షన్ ను అందిచాల్సి ఉంటుంది.

అదే విధంగా లబ్ది దారులు నివాసం ఉంటున్న గ్రామ, వార్డు వాలంటీర్ సచివాలయానికి సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఇక పెన్షన్ పోర్టబిలిటీ కి సంబందించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని సెర్ఫ్ సిఈఓ డీఆర్డీఓ అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రం లో ఉన్న పెన్షన్ లబ్ది దారులందరికి వైఎస్ఆర్ పెన్షన్ కనుక ను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news