మరో రెండురోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. అయతే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు. నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నలుగురి పేర్లను హైకమాండ్ కు పంపించినట్లు తెలుస్తోంది. దీని కోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, కరీంనగర్ నేతలతో కలిసి మంతనాలు చేశారు. ముఖ్యంగా కొండా సురేఖ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షడు కవ్వంపల్లి సత్యనారాయణ మరొక స్థానికుడు అయిన పత్తి క్రిష్ణారెడ్డిలో ఎవరినో ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్లో మొదట్లో ప్రధానంగా కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపించినా.. ఆమె పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఒకవేళ ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించగా, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది.
నేడు హుజురాబాద్ బైపోల్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..? హైకమాండ్ కు చేరిన లిస్ట్
-