పంజాబ్ రాజకీయ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత నుంచి మొదలైన రాజకీయ సంక్షోభం పీసీసీ ఛీప్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా తర్వాత తారాస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి అమరిందర్ సింగ్ బీజేపీలో
చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ప్రాధాన్యతను సంతరిచంకొంది. అయితే అది రైతు చట్టాలు రద్ధు చేయమని కోరేందుకే అని అమరిందర్ వివరణ ఇచ్చారు. అయితే తాజాగా అమరిందర్ సింగ్ తాను బీజేపీలో చేరబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అలా అని కాంగ్రెస్ లో ఉండబోనని తెలిపారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. తనకు జరిగిన అవమానంతో రగిలిపోతున్న అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరకుంటే త్వరలో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.