South Central Railway: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ .. రేపట్నుంచి భారీ మార్పులు

-

రైళ్లలో ప్రయాణించే వారికి… బిగ్ అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రేపట్నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నా యి. ఈ మేరకు తాజాగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు గా… మరికొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైలు గా మార్చింది. అంతేకాకుండా పలు రైళ్లు దారి మళ్ళించడం, వేగం పెంచడం, టెర్మినల్స్ లో మార్పులు కూడా చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మార్పులు రేపటి నుంచే అందుబాటులోకి వస్తాయని స్పష్టంచేసింది దక్షిణ మధ్య రైల్వే. ఐఆర్సిటిసి వెబ్సైటు, నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టం, సంబంధిత రైల్వేస్టేషన్ల స్టేషన్ మేనేజర్/ ఎంక్వైరీ కౌంటర్ ను సంప్రదించి వీటి తాజాగా మార్పులు చేసిన వివరాలను తెలుసుకోవాలని పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే లో మొత్తం 872 ట్రైన్ సర్వీసులు నడుస్తుండగా… 673 ట్రైన్స్ స్పీడ్ పెంచి నట్టుగా వెల్లడించింది.

సూపర్‌పాస్ట్‌గా మారనున్న రైళ్ల వివరాలు(కొత్త ట్రైన్ నెంబర్స్)

1. సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్‌ప్రెస్ (02745/02746)
2. నర్సాపూర్ – నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ (02713/02714)
3. కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02777/02778)
4. సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (02755/02756)
5. కాకినాడ టౌన్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (02699/02700)
6. సికింద్రాబాద్ – హైసర్ ఎక్స్‌ప్రెస్ (02789/02790)

ఎక్స్‌ప్రెస్‌గా మారనున్న ప్యాసింజర్ రైళ్ల వివరాలు..పాత నెంబర్- రూట్(కొత్త నెంబర్)

1. 57121- కాజీపేట్-సిర్పూర్ టౌన్ (07272)
2. 57122- సిర్పూర్ టౌన్ – కాజీపేట్ (07271)
3. 57123- భద్రాచలం రోడ్ – సిర్పూర్ టౌన్ (07260)
4. 57124- సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్ (07259)
5. 57381- గుంటూర్- నర్సాపూర్ (07267)
6. 57382- నర్సాపూర్- గుంటూర్ (07268)
7. 57547- హైదరాబాద్ డెక్కన్- పూర్ణా (07653)
8. 57548- పూర్ణా- హైదరాబాద్ డెక్కన్ (07654)
9. 57549- హైదరాబాద్ డెక్కన్ – ఔరంగబాద్ (07049)
10. 57550- ఔరంగబాద్- హైదరాబాద్ డెక్కన్ (07050)
11. 57563- నాందేడ్- తాండూర్ (07691)
12. 57564 – తాండూర్- నాందేడ్ (07692)
13. 67241 – విజయవాడ – కాకినాడ పోర్ట్ (07273)
14. 67242 -కాకినాడ పోర్ట్- విజయవాడ (07264)
15. 67243 – కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07265)
16. 67244 – విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (07266)
17. 67297 -గుడూరు – విజయవాడ (07261)
18. 67298- విజయవాడ -గుడూరు (07262)
19. 77281 – గుంటూరు – కాచిగూడ (07269)
20. 77282 -కాచిగూడ- గుంటూరు (07270)
21. 77693 – కాచిగూడ -రాయిచూర్ (07797)
22. 77694- రాయిచూర్ – కాచిగూడ (07798)

 

Read more RELATED
Recommended to you

Latest news