ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో NCB అధికారులు ఆర్యన్ ఖాన్ తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిందితులందరిని అధికారులు కోర్ట్ లో ప్రవేశపెట్టారు. ఓ వైపు NCB అధికారులు ఆర్యన్ ఖాన్ ను కస్టడీకి కోరుతుంటే, మరోవైపు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఆయన తరుపున న్యాయవాది గట్టిగా ప్రయత్నిస్తున్నారు. NCB అధికారలు నిందితుల నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ఈనెల 13 వరకు 9 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో కోర్ట్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. గత శనివారం వీరందరిని కస్టడీలోకి తీసుకున్న NCB అధికారులు ఆర్యన్ ఖాన్ నుంచి కీలక వివరాలను రాబట్టారు. ఆర్యన్ కు సంబంధించిన సెల్ ఫోన్ లో డ్రగ్స్ కు సంబంధించిన ఫోటోలు, కోడ్ నేమ్ తో వాట్సాప్ చాటింగ్ ను సేకరించినట్లు సమచారం. కాాగా ఆర్యన్ దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకకున్నా, అతని స్నేహితుల వద్ద నుంచి దాదాపు 8 గ్రాముల కొకైన్ లభించిందని NCB అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే క్రూయిజ్ పార్టీకి ఆర్యన్ గెస్ట్ గా వెళ్లినట్లు తెలిసింది. ఈ కేసులో ఆర్యన్ తోపాటు పలువురు నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.