మీ టీనేజీ కూతురును అడగకూడని, చెప్పకూడని విషయాలు..

-

టీనేజీ వయసులో భావోద్వేగాలు అభివృద్ధి చెందడంతో పాటు శారీరకంగా చాలా మార్పులు సంభవిస్తాయి. ప్రపంచం కొత్తగా కనిపించడం మొదలవుతుంది. చాలా విషయాలు పెద్దలతో చెప్పడానికి ఇష్టపడకుండా తయారవుతారు. అలాంటి టైమ్ లో తల్లిదండ్రులు పిల్లల పట్ల కొంచెం అతి జాగ్రత్త వహిస్తుంటారు. అది ఒక్కోసారి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది. ఐతే టీనేజీ కూతురును అడగకూడని, కూతురుతో చెప్పకూడని కొన్ని విషయాలేంటో ఇక్కడ చూద్దాం.

మూడీగా ఉండకు

మూడీగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. కానీ టీనేజీలో శరీరంలో మార్పులు వస్తాయి. హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ చిరాకు పడడానికి, ఎక్కువ మొండిగా ప్రవర్తించడానికి హార్మోన్లే కారణం అయి ఉంటాయి.

అవతలి వాళ్ళను చూడు

ఇతర పిల్లలతో మీ పిల్లలను పోల్చడం వల్ల ఇంకా మొండిగా, కోపంగా తయారవుతారు. మీ కూతురు సాధించిన చిన్న చిన్న విజయాలను ఆనందించండి. అవి ఆమెకు చాలా బలాన్ని ఇస్తాయి.

నువ్వు బరువు పెరిగావు

టీనేజీ వాళ్ళలో వాళ్ళ లుక్ పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళ లుక్ గురించి మరీ ఎక్కువగా డిస్కస్ చేయవద్దు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

నువ్వలా ఉంటే ఇంకా బాగుండేదానివి

ఇవి బాగానే అనిపిస్తాయి కానీ, మెల్ల మెల్లగా వారి ఆలోచనపై ప్రభావం చూపుతుంది. అందమొక్కటే అత్యంత ముఖ్యమైనదన్న అభిప్రాయం కలిగేలా చేస్తాయి. అందుకే ఇలాంటి వ్యాఖ్యానాలను పక్కన పెట్టండి.

నాకు నీ మీద నమ్మకం లేదు

ఇలాంటి మాటలు మీ కూతురిలో ఆత్మ విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. వారి బాధ ఏంటన్నది అర్థం చేసుకోకుండా స్టేట్మెంట్లు ఇచ్చేయడం మీపై కోపాన్ని పెంచేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news