ఏపీ లోని జగన్ సర్కార్ నిరుద్యోగులకు చెప్పింది. తాడేపల్లిగూడెం లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులతో శాంతిభద్రతల అంశంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది పోలీస్ పోస్టులు భర్తీ చేసేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. దాంతో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీలో నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది.
త్వరలోనే 670 జూనియర్ అసిస్టెంట్… మరో 170 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ రెండు శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు వెల్లడించారు. అంతే కాకుండా 18 నెలల్లో 30 నోటిఫికేషన్ లు విడుదల చేశామని…3 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు.