ఇష్టం లేకుంటే చీరలు తీసుకోకండి..మాకొద్దు పో..!

-

తెలంగాణలో ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా గత రెండు రోజుల నుండి బతుకమ్మ చీరలు అన్ని గ్రామాలలో పట్టణాలలో పంపిణీ చేస్తున్నారు. అయితే తాజాగా వనపర్తి జిల్లా కొత్తపేట మండలం సంకిరెడ్డిపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎంపీపీ మౌనిక బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా గ్రామంలోని మహిళలంతా హాజరయ్యారు. అయితే అక్కడ కూర్చున్న మహిళలు చీరలు నాణ్యత లేవని మాట్లాడుకుంటుండగా ఎంపీపీ మౌనిక చెవిన పడింది. దాంతో కోపంగా ఎంపిపి మౌనిక ‘బలవంతం ఏమీ లేదని ఇష్టం లేకుంటే చీరలు తీసుకోకుండా వెళ్లిపోవచ్చని అన్నారు. దాంతో మహిళలు తమకు ఆ చీరలు అవసరం లేదని వద్దు పో అంటూ అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు.దాంతో ప్యాక్ అప్అంటూ మౌనిక వ్యాఖ్యానించారు. అయితే పక్కన ఉన్న కొంత మంది కార్యకర్తలు మహిళలను బుజ్జగించేందుకు ప్రయత్నించినా వినకుండా అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే నిన్న బతుకమ్మ చీరల పంపిణీ లో మాజీ మంత్రి రాజయ్య కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తల్లి తండ్రి అయ్యారని. ఇప్పుడు బతుకమ్మ చీరలు పంపుతూ భర్త కూడా తన అయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఇప్పుడు మరో సారి ఎంపీపీ చేసిన పనికి బతుకమ్మ చీరల పంపిణీ లో గందరగోళం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news