ఆల్కహాల్ తాగే సమయంలో ఈ పదార్థాలు అసలే తినకూడదట..!

-

మద్యం..బాధలోనూ, సంతోషంలోనూ ముందుగా గుర్తేచ్చేది.. నైట్ టైంలో చల్లని బీర్ తాగుతూ మంచి మెలోడీ సాంగ్స్ వింటూ ఆహా ఏం ఎంజాయ్ చేస్తారు కదూ.ఆల్కహాల్ తాగేప్పుడు ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు. స్టఫింగ్ అంతా తనే తినేస్తాడు.
కొందరు మందుబాబులు ఎలాంటి స్టఫ్ లేకుండా బీరు సీసాలకు సీసాలు, లేక గ్లాసులకు గ్లాసులు లాగించేవాళ్లు ఉంటారు..అసలు మందు తాగేప్పుడు ఎలాంటి స్టఫ్ తీసుకోవాలి. కొన్ని తినకూడని పదార్థాలు ఉంటాయంట. అవి తాగే సమయంలో అసలు తినకూడదట. అ‌వేంటో ఇప్పుడు చూద్దాం.
చాలామంది సిట్టింగ్ వేసేప్పుడు స్టఫింగ్ గా చిప్స్ నే ప్రిఫర్ చేస్తారు. అ‌వి ఐతే చీప్ అండ్ బెస్ట్ లో ఇన్ స్టెంట్ గా వస్తాయి కాబట్టి. మరికొందరు వేరశనగలు, జీడిపప్పు తినటానికి ఇష్టపడతారు. కానీ ఇవి మద్యం సేవించేప్పుడు అసలు తినకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. వేరశనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కాహాల్ తీసుకుంటూ ఇలాంటి పదార్థాలు తినటం వల్ల వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉందట.
మరికొంతమంది సోడా లేదా, కూల్ డ్రింక్ కలిపి తాగుతుంటారు. ఇది ఒకరకంగా మంచిదే. రా తాగకుండా ఇలా చేయటం. కానీ ఆల్కహాల్ లో సోడా లేదా శీతల పానీయం కలిపి తాగటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుందట. కాబట్టి వీలైతే వీటికి బదులు నీళ్లు కలుపుకుని ఆల్కహాల్ సేవించటం బెటర్.

జిడ్డు పదార్థాలు వద్దు

ఆల్కాహాల్ సేవించేటప్పుడు లేదా ఆల్కాహాల్ సేవించిన తర్వాత ఎప్పుడూ జిడ్డుగా ఉండే పదార్ధాలను తినకూడదు. అంటే ఆయిల్ ఎక్కువగా ఉండే వంటలు. తద్వారా కడుపులో గ్యాస్, మంట లాంటి సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్‌ను కూడా స్టఫ్‌గా తినకూడదు. చిప్స్ తినడం వల్ల మీకు చాలా దాహం వస్తుంది. దీనివల్ల ఎక్కువ మందు తాగుతారు. అప్పుడు లేనిపోని సమస్యలు.

పాల ఉత్పత్తులను కూడా తీసుకోవద్దు

కొంతమంది ఆల్కాహాల్ తో జున్ను లాంటివి తింటారు. పొరపాటున కూడా అలా తినకూడదు. పాల ఉత్పత్తులతో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినకూడదు. పాలతో చేసిన పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతింటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కాహాల్ సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. ఈ విషయం మందుబాబులకు తెలుసే ఉంటుంది. మద్యంతో తీపి తింటే ఆహా..మత్తు జెట్ స్పీడ్ లో పెరుగుతుంది. ఒక్క బీర్ కే..రెండు బీర్లు తాగిన మత్తు ఎక్కుతుంది. దానివల్ల రూంలోనే ఉండి తాగేవాళ్లకు ఎలాంటి సమస్య రాకపోవచ్చు. అలాకాకుండా బయటఎక్కడో తాగి..తిరిగి ఇంటికి రావాల్సిన సమస్య ఉంటే మాత్రం స్వీట్స్ లాంటివి తినకపోవటమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news