దిశ కేసులో నేడు సుప్రీంకోర్టు హైపవర్ కమిషన్ విచారణ జరపనుంది. ఈ రోజు దిశ కమిషన్ విచారణ కు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ హాజరుకానున్నారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ సీపీ గా సజ్జన్నార్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. దాంతో సజ్జన్నార్ ఈరోజు విచారణ కు హాజరు కావాలని జ్యుడీషియల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్మెంట్ ను కమిషన్ నమోదు చేయనుంది.
ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలను, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాగ్మూలాలను ఇప్పటికే కమిషన్ నమోదుచేసుకుంది. కాగా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో సజ్జన్నార్ హైదరాబాద్ సీపీగా ఉండటంతో ఆయన స్టేట్మెంట్ విచారణలో కీలకంగా మారే అవశకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సజ్జన్నార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.