ఏపీ కి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ‘ఒక ఉపరితలద్రోణి’ తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమల గుండా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి ఏర్పడింది.సుమారుగా 10 అక్టోబర్ 2021 తేదీన ఉత్తర అండమాన్ సముద్రం నందు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 4-5 రోజులలో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా & ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది.వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.