ఈటెల గెలిస్తే బండి కి డేంజర్…రేవంత్ షాకింగ్ కామెంట్స్..!

-

హనుమకొండలో కాంగ్రెస్ పిసిసి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం అనేది సుద్ద తప్పు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్ ను దగ్గరకు తీస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదంటు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన ప్లైట్ కేసీఆరే అరేంజ్ చేశాడు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.revanth reddy etela rajender

హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే అని రేవంత్ అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ హరీష్ రావు ను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం, ఆతర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదం అంటూ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతాం అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news