టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి….ప్రత్యర్ధి పార్టీల నుంచి కంటే సొంత పార్టీల నుంచే పెద్ద ముప్పు ఉన్నట్లు కనిపిస్తోంది. మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు…కాదు కాదు బహిరంగ విభేదాలు ఎక్కువని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ విషయం ఉన్నా సరే కాంగ్రెస్ నేతలు బయటకొచ్చి మరీ….సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తారు. ఈ విషయంలో ఏ మాత్రం మొహమాటం పడరు.
అయితే రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక….కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అసలు సొంత పార్టీ నేతలే రేవంత్‌పై ప్రత్యర్ధుల కంటే ఎక్కువ విమర్శలు చేశారు. సరే ఎన్ని విమర్శలు వచ్చినా సరే రేవంత్…అన్నీ వదిలేసి పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు మొదలుపెట్టారు…టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రేవంత్‌కు ప్రజాదరణ పెరిగింది. దీంతో సీనియర్లు కాస్త సైలెంట్ అయ్యి, రేవంత్ బాటలో వెళుతున్నారు.
పైకి బాగానే ఉన్న సరే లోపల మాత్రం సీనియర్లు సమయం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ని ఎక్కడ దెబ్బకొడదామని కాచుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్లకు హుజూరాబాద్ రూపంలో మంచి ఛాన్స్ వచ్చింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ది మూడో స్థానమే అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రేవంత్ కూడా హుజూరాబాద్ ఎన్నికని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు.
రేవంత్ సీరియస్‌గా తీసుకోకపోయినా కాంగ్రెస్ సీనియర్లు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఎంత ఘోరంగా ఓడిపోతే…అంత ఎక్కువగా రేవంత్‌ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. హుజూరాబాద్‌లో రేవంత్ ఫెయిల్ అయితే సీనియర్లు ఆడేసుకుంటారు. ఇదే అదును అనుకుని అధిష్టానం వద్ద హడావిడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్…కనీసం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోకుండా చూసుకుంటే బెటర్. లేదంటే తాను ఎన్నికని పట్టించుకోలేదని చెప్పిన సరే…సీనియర్లు మాత్రం దీన్నే సీరియస్‌గా తీసుకుని రేవంత్‌కు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.