ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 19,740 కేసులు

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో అస్సలు స్థిరంగా ఉండటం లేదు కరోనా మహమ్మారి కేసులు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,740 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,36,643 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.06 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 248 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,50, 375 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 23, 070 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా మొత్తం కరోనా కేసులు సంఖ్య 33,935,309 కు చేరింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 93.99 కోట్ల మంది కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పండుగలు వస్తున్న తరుణంలో కరోనా నియమాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news