ఐసీసీ నంబ‌ర్ వ‌న్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మ‌ళ్లీ కోహ్లి..!

-

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మ‌ళ్లీ స్థానం ద‌క్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో తాజాగా జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 97 పరుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 103 రన్స్ చేశాడు. దీంతో ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి స్మిత్‌ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 937 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో కోహ్లి 200 పరుగులు చేశాక తొలిసారి టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో ఏడాదిపాటు నిషేధం వేటు ఎదుర్కొంటున్న స్మిత్‌ను కోహ్లి వెనక్కి నెట్టాడు. అయితే రెండో టెస్టులో 40 పరుగులు మాత్రమే చేయడంతో.. టాప్ ప్లేస్‌ను కోల్పోయాడు. కానీ మూడో టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేయ‌డంతో విరాట్ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కాగా ఈ సిరీస్‌లో పేలవ ఆటతీరు కనబరుస్తోన్న జో రూట్ ఐదో స్థానానికి పడిపోయాడు.

కాగా విరాట్ మరో పాయింట్ సాధిస్తే.. ఆల్‌టైం రేటింగ్ పాయింట్లలో టాప్-10 ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు. బ్రాడ్‌మాన్ (961), స్టీవ్ స్మిత్ (947), జాక్ హబ్స్, రిక్కీ పాంటింగ్ (ఇద్దరూ 942) పాయింట్లు సాధించగా.. పీటర్ మే, గ్యారీ సోబర్స్, క్లైడ్ వాల్కాట్, వివియన్ రిచర్డ్స్, కుమార సంగక్కర (వీరంతా 938 పాయింట్లు) సాధించారు. ఇక మూడో టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించడంతోపాటు అర్ధ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 8 స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్న పాండ్య.. బౌలింగ్ విభాగంలో 23 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఏకంగా 27 స్థానాలు మెరుపర్చుకొని 17వ స్థానం దక్కించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news