నాగ్ బర్త్ డే సర్ ప్రైజ్ ఏంటంటే..!

-

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న సినిమా దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27 రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సిని ప్రియులను అలరించింది. ఇక ఈ సినిమా నుండి మొదటి టీజర్ రిలీజ్ కాబోతుంది.

ఆగష్టు 29న కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా దేవదాస్ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు. నాగార్జున బర్త్ డే సర్ ప్రైజ్ గా ఫ్యాన్స్ కోసం ఈ టీజర్ వదులుతున్నారట. డాన్ పాత్రలో నాగార్జున, డాక్టర్ రోల్ లో నాని ఇలా ఇద్దరు కలిసి చేసే సందడితో ఈ సినిమా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్స్ గా నటిస్తున్న దేవదాస్ సినిమా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి టీజర్ ఇంకెలా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి. మహానటి సినిమా తర్వాత అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news