కోల్ క్రైసిస్: 115 కేంద్రాల్లో అడుగంటిన బొగ్గు నిల్వలు

-

దేశంలో విద్యుత్ సంక్షోభం రాబోతోందా.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు విద్యుత్ సంక్షోభానికి దారి తీసేలా ఉన్నాయి. దేశంలో మొత్తం 135 విద్యుత్ కేంద్రాలు ఉంటే ప్రస్తుతం 115 కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సగటున మరో నాలుగైదు రోజుల్లో నిల్వలు దాదాపుగా ఐపోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 17 కేంద్రాల్లో కనీసం ఒక రోజుకు సరిపోయే బొగ్గు నిల్వలు లేవు. 26 కేంద్రాల్లో ఒక రోజుకు, 22 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రెండు రోజులకు, 18 విద్యుత్ కేంద్రాల్లో 3 రోజులకు, 13 విద్యుత్ కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు మాత్రమే ఉంది. ఉత్తర భారత దేశంలోని 33 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదర్కొంటోంది. హర్యానా, రాజస్థాన్, పంజాబ్, డిల్లీలపై బొగ్గు కొరత ప్రభావం పడనుందని సెంట్రల్ ఎలక్ట్రిక్ అథారిటీ తెలిపింది. బొగ్గు, విద్యుత్ సంక్షోభంపై సోమవారం కేంద్ర హోం మంత్రి, విద్యుత్, కోల్ మినిస్టర్లతో సమావేశంమై అధికారులతో సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news