సాధారణంగానే ముక్క చుక్క అమ్మకాలు జోరు గా ఉంటాయి. ఇక పండగ వచ్చిందంటే మద్యం మాంసం అమ్మకాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా న్యూ ఇయర్ దసరా పండగ సందర్భాల్లో తెలంగాణలో మాంసం మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయి. కాగా దసరా సందర్భంగా కూడా అలాంటి సీనే తెలంగాణ లో కనిపించింది. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా మద్యంతో పాటు చికెన్ మటన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
దసరా పండుగ రోజున శుక్రవారం ఏకంగా రూ. 200 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. అంతేకాకుండా అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 15 తేదీ మధ్య ఐదు రోజులలో ఏకంగా ఆరు వందల ఎనభై ఐదు కోట్ల పైగా మద్యం అమ్ముడుపోయింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురు శుక్ర వారాల్లో 50 లక్షల కేజీల చికెన్…. 10 నుండి 12 లక్షల కేజీల మటన్ అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.