జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు వచ్చిన ప్రకాష్ రాజ్.. పరిస్థితి ఉద్రిక్తత

-

మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికల ఫలితాలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా మా అర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు చోటు చేసుకున్న గోడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ పై పెద్ద వివాదమే రాజుకుంటోంది. ఆ సీసీ ఫుటేజ్‌ కావాలని ఇప్పటికే ఎన్నికల అధికారికి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాయగా… అసలు ఇవ్వబోమని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ పేర్కొన్నారు.

దీంతో ఇవాళ ఎన్నికలు జరిగిన జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కు స్వయంగా ప్రకాష్‌ రాజ్‌ వచ్చారు. ప్రకాష్‌ రాజ్‌ తో పాటు… పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇరు ప్యానెల్‌ సభ్యులు ఉన్నప్పుడే.. సీసీ ఫుటేజ్‌ చూపిస్తామని పోలీసులు చెప్పారు. అయితే.. మంచు విష్ణు ప్యానెల్‌ తిరుమల లో ఉండటంతో.. పోలీసులు మరే ఎలాంటి నిర్నయం తీసుకుంటారో చూడాలి. సీసీ ఫుటేజ్‌ చూశాకే తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని అటు ప్రకాష్‌ రాజ్‌ మీడియాతో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news